ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
ఇస్సొయ్ ఇస్సోయ్ రంగ.. “ఇస్సోయ్”
పొద్దుటేల సద్దితిని ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
ఇల్లు ఇల్లు తిరిగొచ్చి ” ” ” ”
గుడ్డలన్ని పోగుచేసి ” ” ” ”
మూటముల్లె కట్టుకొని ” ” ” ”
సాకిరేవు కెల్లెసరికి తిన్నసద్ది అరిగిపాయె “ఇస్సోయ్”
బట్టలన్ని నానబెట్టి ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
సోడనీళ్లు కలియబెట్టి ” ” ” ”
కట్టెలన్ని మంటబెట్టి ” ” ” ”
గుడ్డలన్ని ఉడకబెట్టి ” ” ” ”
బండకేసి బాదుడాయె కండలన్ని పీకుడాయె “ఇస్సోయ్”
పిల్లగుడ్డ జెల్లగుడ్డ ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
అంటుగుడ్డ ముట్టుగుడ్డ ” ” ” ”
మల్లెలోలె తెల్లగుతికి ” ” ” ”
ఎన్నెలోలె వన్నెదెస్తె ” ” ” ”
ఉన్న దొరముండకొడుకు చిన్నపైస యివ్వకుండె “ఇస్సోయ్”
గయ్యాళి దొరసాని ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
గంపెడన్ని గుడ్డలేసె ” ” ” ”
వుతుకుతుంటె పాతబట్ట ” ” ” ”
సినుగులన్ని సేటలాయె ” ” ” ”
బలిసినా దొరసాని బూతులెన్నొ కూయబట్టె “ఇస్సోయ్”
రోజుకుంట రొప్పుకుంట ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
రోజువారి గుడ్డలుతికి ” ” ” ”
మాపటేల బువ్వకెల్తే ” ” ” ”
మాడుముక్క పెట్టబట్టె ” ” ” ”
ఓర్నీ కూడు పాడు గాను ఆకలన్న తీరదాయె “ఇస్సోయ్”
నీల్లల్లో కాల్లు నాని ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
వొరిసిపాయె సీకిపాయె ” ” ” ”
రాల్లపైన ఇసుకపైన ” ” ” ”
కాల్లుగాలి కాయగాసె ” ” ” ”
దవాఖాన కెల్దమంటె దమ్మిడన్న లేకపాయె “ఇస్సోయ్”
ఎండలోన ఎండుడాయె ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
వానలోన వనుకుడాయె ” ” ” ”
సలిలోన సచ్చుడాయె ” ” ” ”
బండలోలె బతుకుడాయె ” ” ” ”
గాడ్దివోలె చాకిరాయె గంజినీల్లు దొరకవాయె “ఇస్సోయ్”
సాకలోల్ల బతుకులన్ని ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
సాకిరేవు కతలన్ని ” ” ” ”
దోపిడిని కూల్చెవరకు ” ” ” ”
మారబోవు తీరబోవు ” ” ” ”
బండరాల్లు దోపిడోల్ల గుండెపైకి ఇసరాలె “ఇస్సోయ్” 29/8/1983
(పల్లవి, దాదాపు ఒక చరణం అందించిన తిర్మల్ కు, పూర్తిగా ఒక చరణం రాసిన కానూరి తాత గారికి ఈ పాట రుణపడిఉంటుంది)
(పల్లవి, దాదాపు ఒక చరణం అందించిన తిర్మల్ కు, పూర్తిగా ఒక చరణం రాసిన కానూరి తాత గారికి ఈ పాట రుణపడిఉంటుంది)
No comments:
Post a Comment