పోతా నే బోతరన్న పోరాటం బాటలోన
పోతే మానె గీతేమానె తిరిగిరాక పోతేమానె..
పోతా
నక్సల్బరి గడ్డలోన నాగలి బట్టిన రైతులు
రైఫిళ్ళను అందుకుని రివిజినిజం పారద్రోలి
ముందు తరం కొరకు వాళ్ళు మందుగుండై పేలిరంట..
పోతా
శ్రీకాకుళ అడవిలోన గిరిజన సింహాలు లేచి
భూములాక్రమించినా భూస్వాముల గుండెలదర
విల్లంబులు చేతబట్టి విక్రమించ కదలిరంట..
పోతా
గోదావరి లోయలోన గోడు గోడు నేడ్చేటోళ్ళు
గోచిగుడ్డ గరీబోళ్ళు గంజి గట్క తాగెటోళ్ళు
గొడ్డళ్ళు ఎత్తిరంట.. గుతపలు మల్లేసిరంట..
పోతా
20/9/1982
20/9/1982
No comments:
Post a Comment