నిలబడు నిలబడు కూలన్నా
నీ ఎంట నేనొస్తా కూలన్నా.. “నిలబడు”
రెక్కలిరగదీసినోడ కూలన్నా
రేగల్లు దున్నినోడ ”
బతుకు బలి చేసినోడ ”
బంజర్లు సాకినోడ ”
అరిగోస పడ్డవోడ ”
అడవుల్ని నరికినోడ ”
భూసారం పిండి పిండి ”
బంగారం చేసినోడ ” “నిలబడు”
పశువుల్ని గాసెటోడ కూలన్నా..
పేడకల్లు దీసెటోడ ”
సావిల్లు వూడ్చెటోడ ”
సాకిరి జేసెటోడ ”
దొరలకాడ సేవ జేసి ”
చేవ చచ్చిపోయినోడ ”
జీతాని కున్న వోడ ”
నీ జీవితాన్ని మార్చుకోర ” “నిలబడు”
పొట్టెకర్లు పేసుకుని కూలన్నా..
చెట్లెన్నో ఎక్కెటోడ ”
తాడిచెట్టు ఎక్కెటోడ ”
తాటికల్లు గీసెటోడ ”
ఈతచెట్టు ఎక్కెటోడ ”
ఈతకల్లు గీసెటోడ ”
బట్టెబాజి దొరలంత ”
లొట్టిదొంగలవ్వబట్టె ”
కల్లుగీసి అమ్ముకుంటె ”
ఉప్పుకల్లు రాదురన్నా ” “నిలబడు”
కత్తెర్లు ఏసెటోడ కూలన్నా..
సవరాలు జేసెటోడ ”
గడ్డాలు గీసెటోడ ”
మాలీసు జేసెటోడ ”
మంగలి పనిజేస్తే ”
మింగమెతుకు లేదురన్నా ”
బితుకు బితుకుమంట వేర ”
బతుకు కొరకు లేచి రార ” “నిలబడు”
గొంగడి ఏసుకోని కూలన్నా..
గుట్టగుట్ట తిరిగెటోడ ”
గొర్లను మేపెటోడ ”
గొతికల్ని అమ్మెటోడ ”
పాలదుత్త దొరలపాలు ”
నీకు పేడ ఎత్తిపోతమిగులు ”
బుర్రమీస మంతవున్న ”
జర్రపొగరు చూపరాద ” “నిలబడు”
ఎండలేదు వానలేదు కూలన్నా..
పండగ పబ్బాలు లేవు ”
అరుసుకునే దిక్కు లేదు ”
అరవ చాకిరాయె బతుకు ”
దొరల పెళ్ళి సారమోస్తే ”
చారునీల్ల కూడె నీకు ”
రోత బట్టలుతికినా ”
పాతగుడ్డ ఇవ్వడాయె ”
చాకిరేవు బట్టలోలె ”
చచ్చినోల్ల పట్టివుతుకు ” “నిలబడు”
గట్టు తవ్వి మట్టి పిసికి కూలన్నా..
ముద్ద ముద్ద తొక్కటోడ ”
చెమటలాను గక్కుకుంట ”
సారెను దిప్పెటోడ ”
కుండజేసె కుమ్మరన్న ”
ఓటికుండ బతుకురన్నా ”
మట్టిలోన వుప్పులాగ ”
ఈ ఎట్టి బతుకు ఏలరన్నా.. ” “నిలబడు”
మొద్దును నరికెటోడ కూలన్నా..
ముక్కలాను జేసెటోడ ”
బాడీస పట్టుకుని ”
గాడీలు దీసెటోడ ”
చిత్రీలు పట్టెటోడ ”
చిత్రాలు చెక్కెటోడ ”
మంచము చేసి ఇస్తే ”
నీకంచమైన నిండదేరా.. ” “నిలబడు”
వేడివేడి కొలిమి కాడ కూలన్నా..
ఉడికి ఉడికి పోయెటోడ ”
కొడవల్లు జేసెటోడ ”
కర్రు సాగ దీసెటోడ ”
ఎంత చేసినా నీకు ”
చింత తీరదేమిరన్నా ”
కొలిమిలోని నిప్పువయ్యి ”
కాల్చాలి దోపిడిని ” “నిలబడు”
చర్మాన్ని సాగదీసి కూలన్నా..
చెప్పులాను కుట్టెటోడ ”
తోలును పదును చేసి ”
తొండాలు చేసెటోడ ”
ఊరివాల్ల పనులు చేస్తే ”
ఊరవతల గుడిసె నీకు ”
అంటరాని బతుకు ఏల ”
కంటనిప్పు చెరగరార ” “నిలబడు”
కులం పేర కట్టు చేసి కూలన్నా..
మన కట్టుముడి విప్పుతుండ్రు ”
నీ కులము ఏదైనా ”
కూడులేని కులం మనది ”
సర్కారు దొరలు కలిసి ”
దొంగలయ్యి దోచుకుండ్రు ”
దోచుకునేటోల్ల పైన ”
తాచులాగ లేవరన్నా.. ” “నిలబడు”
కష్టాలు ఓర్చుకోని కూలన్నా..
కన్నీల్లు తుడ్చుకోని ”
రికాము లేని చాకిరితో ”
లోకాన్ని నడుపుతావు ”
ఎన్ని బాధలున్న గాని ”
ఎన్నెలోలె నవ్వుతావు ”
ఎన్న కన్న మెత్తనోడ ”
గన్నువోలె లేవరన్న ”
కలబడు కలబడు కూలన్నా..
నీ చేతిలోన కత్తినవుతా కూలన్నా... 11/2/1984
No comments:
Post a Comment